అత్యవసర సేవలు బహిష్కరించిన జూడాలు

16 Oct, 2014 11:44 IST|Sakshi
అత్యవసర సేవలు బహిష్కరించిన జూడాలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ జూడాలు చేపట్టిన సమ్మె గురువారం 18 రోజుకు చేరుకుంది. పలు ఆస్పత్రుల్లో అత్యవసర సేవలను జూడాలు బహిష్కరించారు. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వంతో జూడాలు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా జూడాలు లేవనేత్తిన దాదాపు అన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ గ్రామీణ ప్రాంతంల్లో విధుల నిర్వహణను జూడాలు వ్యతిరేకిస్తున్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 107ను వెంటనే రద్దు చేయాలని జూడాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ జూడాల డిమాండ్ను ప్రభుత్వం తొసిపుచ్చింది. దీంతో జూడాల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు