మరోసారి టీఆర్ఎస్ మాక్ పోలింగ్

31 May, 2015 11:09 IST|Sakshi

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ నేడు మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించనుంది. తెలంగాణ భవన్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే మాక్ పోలింగ్కు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఎంఐఎం పార్టీని కూడా టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించింది. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటో ప్రాధాన్యత ఓటు ద్వారానే ఐదో అభ్యర్థిని గెలుచుకుంటామని టీఆర్ఎస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు