సెప్టెంబర్‌ నుంచి పెరిగిన లెర్నింగ్‌ లైసెన్స్‌లు

9 Oct, 2019 11:32 IST|Sakshi

కొత్త చట్టంతో  మార్పు

సాక్షి, వైరా: సెప్టెంబర్‌ 1 నుంచి ఆర్టీఓ కార్యాలయాల ఎదుట లైసెన్స్‌లు తీసుకునేందుకు జనాలు బారులు తీరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన వాహన చట్టాన్ని సెప్టెంబర్‌ 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వాహన చట్టం ప్రకారం దేనికి ఎంతో జరిమానా విధిస్తారో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో వాహనదారుల్లో భయంతో లైసెన్స్‌లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, ట్యాక్స్‌లను చెల్లించేందకు ముందుకు వస్తున్నారు. ప్రమాదాలను నివారించడానికి, మద్యం సేవించి వాహనం నడపకుండా అడ్డుకునేందుకు, లైసెన్స్‌లు లేకుండా తిరగడం ఆగేలా, అతి వేగాన్ని కట్టడి చేయడానికి ఈ చట్టం ద్వారా అధిక జరిమానాలు విధించేలా నిర్ణయించిన విషయం విదితమే. దీంతో..తనిఖీల్లో దొరికితే ఫైన్లు అధికంగా కట్టాల్సి వస్తుందనే భయంతో వాహనదారులు స్వయంగా కావాల్సిన పత్రాలు పొందేందుకు రవాణాశాఖ కార్యాలయం ఎదుట బారులు తీరుతున్నారు.  

జిల్లాలో గతంలో రోజుకు సగటు 40
ప్రస్తుతం సగటు 70
సత్తుపల్లిలో     40
ఖమ్మంలో    120
వైరాలో         35


వైరాలోని ఎంవీఐ కార్యాలయం

ఫైన్ల భయంతోనే.. 
కొత్తచట్టం ద్వారా ఎక్కువ ఫైన్‌ వేస్తారనే భయంతోనే లైసెన్స్‌లు, బండి కాగితాలు తీసుకుంటున్నారు. మద్యం తాగి వాహనం నడపడానికి జంకుతున్నారు.  
– సామల ఉదయ్‌కుమార్, వైరా 

శ్రద్ధ పెరిగింది..
సెప్టెంబర్‌ 1 నుంచి లైసెన్స్‌లు తీసుకోవడానికి వాహన దారులులు శ్రద్ధ చూపుతున్నారు. ఆ సంఖ్య గతం కంటే పెరిగింది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, వాహన ట్యాక్స్‌లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. అవగాహన పెరగాల్సి ఉంది. వాహనదారులు నేరుగా వచ్చి అవసరమైన పత్రాలు చేయించుకోవచ్చు.  
– శంకర్‌నాయక్,ఎంవీఐ, వైరా   

>
మరిన్ని వార్తలు