హడలెత్తించిన చిరుత

21 Jan, 2020 05:14 IST|Sakshi

షాద్‌నగర్‌ నడిబొడ్డున ఓ ఇంటిపైకి వచ్చిన పులి

మత్తు మందు ఇచ్చిన తర్వాత వీధుల్లో పరుగులు

చివరకు బంధించి హైదరాబాద్‌ జూపార్కుకు తరలింపు

షాద్‌నగర్‌ టౌన్‌/రూరల్‌: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో ఓ చిరుత హడలెత్తించింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక షాద్‌నగర్‌లోని పటేల్‌ రోడ్డుపై ఒక చిరుతవచ్చింది. అక్కడి నుంచి ప్రై వేట్‌ ఉద్యోగి మన్నె విజయ్‌కుమార్‌ ఇంటిపైకి చే రింది. పైపోర్షన్‌లో ఉండే ఆయన సోమవారం పా లు తీసుకొచ్చి చూడగా వాటర్‌ ట్యాంక్‌ పక్కన చి రుత తోక కనిపించింది.  వెంటనే ఆయన ఇంట్లోని తన భార్యకు విషయం చెప్పి బయటకు రావొద్దని అప్రమత్తం చేశాడు. అలాగే కాలనీవాసులతో పా టు 100కు డయల్‌ చేసి సమాచారం ఇచ్చాడు. షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్, సీఐ శ్రీధర్‌కుమార్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని మరో ఇంటి పైనుంచి చిరుతను పరిశీలించారు.

మత్తు మందు ఇచ్చి..: విషయాన్ని పోలీసులు ఫారెస్టు అధికారులతో పాటు హైదరాబాద్‌ జూపా ర్కు సిబ్బందికి సమాచారమిచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి బీమానాయక్, శంషాబాద్‌ రేంజ్‌ ఆఫీసర్‌ హరిమోహన్‌రెడ్డి, రెస్క్యూ టీం అధికారి రమేష్‌కుమార్, జూపార్కు అసిస్టెంట్‌ డాక్టర్లు అస దుల్లా, అఖిల్, డిప్యూటీ డైరెక్టర్‌ ఎండీ హకీం ఘట నా స్థలానికి చేరుకున్నారు. రెస్యూ టీం సిబ్బంది చి రుత ఉన్న ఇంటి చుట్టూ వలలు వేశారు. ఉదయం 8కి చిరుత మెట్ల పైనుంచి కిందికి వచ్చి బాత్‌రూం ఎదుట పడుకుంది. రెస్యూ టీం ఇంటి లోపలికి వెళ్లి బాత్‌రూం కిటికీ నుంచి ట్రంక్‌ లైజర్‌ సాయంతో షూట్‌ చేసి రెండు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు.

చిరుత పరుగులు.. 
మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన వెంటనే పులి ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టింది. దీంతో కాలనీలోని జనం భయాందోళనకు గురయ్యారు. చిరుత పరుగెత్తే సమయంలో దానికి ఎదురుపడిన కానిస్టేబుల్‌ లక్ష్మణ్‌పై పంజా విసరడంతో ఆయనకు స్వల్ప గాయాలవగా.. చిరుత పక్క వీధిలోని ఓ పాడుపడిన గోడల్లో పడిపోయింది. వెంటనే అటవీ సిబ్బంది, రెస్క్యూ టీం దానిని బంధిం చి ప్రత్యేక అంబులెన్సులో హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించారు. చిరుత  విషయం తెలుసుకొని జనం పటేల్‌ రోడ్డుకు భారీగా తరలివచ్చారు. పట్టుబడిన చిరుత మగదని, రైల్వేస్టేషన్‌ సమీపంలోని కమ్మదనం అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని డీఎఫ్‌ఓ బీమానాయక్‌ అనుమానం వ్యక్తం చేశారు.  

చిరుతను బంధిస్తున్న దృశ్యం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా