మద్యం లైసెన్సులు పొడిగింపు 

26 Sep, 2019 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వైన్‌షాపుల లైసెన్సులను నెలరోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎక్సైజ్‌ చట్టం–1969లోని సెక్షన్‌–17 ప్రకారం ప్రస్తుత షాపుల గడువును ఈ ఏడాది అక్టోబర్‌1 నుంచి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఎక్సైజ్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల రోజులకు గాను వార్షిక లైసెన్స్‌ ఫీజులో నెలకు సగటున అయ్యే మొత్తాన్ని ఫీజు కింద వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.

ఈనెల రోజుల పాటు వైన్‌షాపుల యజమానులు కొనుగోలు చేసే మద్యంపై సాధారణంగా వర్తించే వ్యాట్‌తో పాటు టర్నోవర్‌ ట్యాక్స్‌ కింద 8% అదనపు పన్ను విధించనున్నట్టు వెల్లడించారు. ఏ4 షాపులకు వర్తించే అన్ని నిబంధనలు వైన్‌షాపులకు వర్తిస్తాయన్నారు. 2017–19 సంవత్సరాలకు గాను ఈనెల 30 తో పాత షాపుల గడువు ముగియనుండగా, అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం షాపులు ఏర్పాటు కావా ల్సింది.  2019–21 సంవత్సరాలకు గాను కొత్త పాలసీ విడుదలలో జరిగిన జాప్యం కారణంగా రెన్యూవల్‌ చేయాల్సి వచ్చింది. ఈ మేరకు ప్రతిపాదించిన ఫైలు సీఎం ఆమోదం పొందిందని, అధికారిక ఉత్త ర్వులు వెలువడటమే ఆలస్యమని మంగళవారం ‘సాక్షి’లో ‘మద్యం... పొడిగింపు తథ్యం’శీర్షికన కథనం ప్రచురించడం గమనార్హం.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా