ప్రజాపోరాటాలతోనే తెలంగాణ

7 Jun, 2014 03:35 IST|Sakshi
ప్రజాపోరాటాలతోనే తెలంగాణ

తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం

తిరుమలగిరి, న్యూస్‌లైన్: సకల జనుల పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని.. అలాగే ఐక్యత చూపిస్తూ తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తిరుమలగిరిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ జిల్లా ప్రాముఖ్యత ఎనలేనిదని కొనియాడారు. ఉద్యోగుల పంపిణీ విషయంలో తెలంగాణ ఉద్యోగస్తులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే తెలంగాణ ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని కోరారు.
 
అలాగే ముంపుపేరుతో ఏడు మండలాలను ఆంధ్రప్రాంతానికి తరలించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ర్ట అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణను సాధించుకోవడం ఒక ఎత్తని. ఇప్పుడు మన అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని కోరా రు. తెలంగాణ ప్రాంత అభివృద్ధే జేఏ సీ లక్ష్యమని, తెలంగాణ ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, ధర్మార్జున్, మల్లేష్, కోటాచలం, బిచ్చునాయక్, నవీన్, నాగానంద్, రాంచందర్‌గౌడ్ పాల్గొన్నారు.
 
 మంత్రి జగదీష్‌రెడ్డికి పరామర్శ
 అర్వపల్లి : ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని శుక్రవారం రాత్రి నాగారంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు. అనంతరం విద్యాశాఖకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. పరామర్శించిన వారిలో జేఏసీ జిల్లా ఛైర్మన్ జి.వెంకటేశ్వర్లు, టీవీవీవీ జిల్లా అధ్యక్షుడు కుంట్ల ధర్మార్జున్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, పొన్న మల్లేష్‌నేత, దబ్బేటి అంజయ్య, పగిళ్ల సైదులు, తహసిల్దార్ అరుణజ్యోతి, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, దావుల వీరప్రసాద్ యాదవ్, వలిగొండ కృష్ణ, న్యాయవాది పాటి నాగిరెడ్డి, పాశం యాదవరెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు