ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర

26 Nov, 2019 01:48 IST|Sakshi

మంత్రి సత్యవతి రాథోడ్‌

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సంక్షేమ భవన్‌లో మేడారం జాతర ఏర్పా ట్లపై ఆమె సమావేశం నిర్వహించారు. జాతరకు డిసెంబర్‌ చివరి వారం నుం చే భక్తుల తాకిడి ఉంటుందని, కాబట్టి డిసెంబర్‌ నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.

పార్కిం గ్, వసతుల కల్పనలో లోపాలు ఉండద్దన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శించేందుకు వీలుగా పర్యా టక ప్రాంతాలపై ప్రచారం చేయాలన్నారు. జాతరను ప్లాస్టిక్‌ రహిత జాతరగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. పాలు, పాల ఉత్పత్తుల సరఫ రా కోసం విజయ డైరీని భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసిందని, వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు వీటిని వెచ్చిస్తామని మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు