కుక్కకు మెమోరాండం

19 Jul, 2015 23:47 IST|Sakshi
కుక్కకు మెమోరాండం

వికారాబాద్ రూరల్ : మున్సిపల్ కార్మికులు ఆందోళనలో భాగంగా వికారాబాద్‌లో కుక్కకు మెమోరాండం ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ చేపట్టిన సమ్మె ఆదివారం 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షుడు పి. మల్లేశం మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం రూ. 14,170, సూపర్‌వైజర్లకు రూ. 17,380 ఇవ్వాలన్నారు. కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సమ్మెలో ఉన్న కార్మికులకు మద్దతుగా ఈ నెల 20 నుంచి 24 వరకు వామపక్ష పార్టీలు బస్సుయాత్ర నిర్వహిస్తున్నాయని, వికారాబాద్‌లో ఈ నెల 20న ప్రారంభిస్తారన్నారు.

కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జవాన్ చిన్నయ్య, కార్మికులు జంగయ్య, భాస్కర్, జి. రాములు , దేవ్యనాయక్, రాములు, బుచ్చయ్య, రవి, దశరాత్, జంగమ్మ, బాల్‌రాజ్, జంగమ్మ, నీలమ్మ, అండాలు, గంగమ్మ, నర్సమ్మ, లక్ష్మి, అనుసూజ, సత్యమ్మ, శంకర్, వెంకట్, ఆశ, ఎల్.లక్ష్మి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు