మెట్‌పల్లి ప్రభుత్వాస్పత్రిలో రికార్డు ప్రసవాలు

24 Mar, 2018 12:20 IST|Sakshi

రాష్ట్రంలోని సీహెచ్‌సీల్లో మొదటి స్థానం

లక్ష్యం 660... జరిగినవి 1444మెట్‌పల్లి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ 

మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లి ప్రభుత్వాస్పత్రి ప్రసవాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)లల్లో అన్నింటికన్నా ఎక్కువ ప్రసవాలు జరిగిన ఆస్పత్రిగా మెట్‌పల్లి రికార్డు సృష్టించింది. 2017–18(ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు) మొత్తం 660 ప్రసవాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1444 ప్రసవాలు జరిగాయి. 50 పడకలతో ఉన్న ఈ ఆస్పత్రిలో రెండు, మూడు సంవత్సరాల క్రితం నామమాత్రంగా ప్రసవాలు జరిగేవి.
 

ఈఏడాది ప్రభుత్వం ‘కేసీఆర్‌ కిట్‌’ పథకాన్ని అమలు చేస్తుండడంతో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో పాటు ఓపీ, ఇన్‌పేషంట్‌ తదితర సేవల్లోనూ రాష్ట్రంలోని సీహెచ్‌సీల్లో రెండో స్థానంలో నిలవడం విశేషం. దీనిపై సూపరిండెంట్‌ ఆమరేశ్వర్‌ స్పందిస్తూ ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న సిబ్బంది సమష్టిగా పని చేస్తూ మంచి సేవలందిస్తుండడంతో రికార్డు ప్రసవాలు జరిగాయని వివరించారు. ఆస్పత్రి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు.          
 

మరిన్ని వార్తలు