‘బంగారు తెలంగాణ కోసం కేసీఆర్‌ కలలు కన్నారు’

14 Jun, 2019 19:58 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలకు సరైన వైద్యం అందాలని, బంగారు తెలంగాణ కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలలు కన్నారని తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మహిళలకు పౌష్టిక ఆహారం, కేసీఆర్‌ కిట్స్‌ లాంటి పథకాలు కేసీఆర్‌ అందించారు.. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న ఆసుపత్రులు మెరుగు పర్చామని తెలిపారు. అడవుల్లో ఉన్న ఆదివాసులకు, మారుమూల  ప్రాంతాల ప్రజలకు వైద్యం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలియజేశారు.

ట్రైబల్‌ ప్రాంతాల్లో ఉన్న అధికారులతో, నేతలతో కూడా సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. మెడికల్‌ కాలేజీల్లో సీట్లు పెంచామని, మూడు వేల పడకల ఆసుపత్రులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎయిమ్స్‌ ఆసుపత్రి పని ఇంకా నడుస్తోందని చెప్పారు. హెల్త్‌కార్డులు అన్ని ఆసుపత్రుల్లో పని చేస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు