'కార్పొరేటర్లను వదులుకునేందుకు సిద్ధం'

22 Dec, 2017 12:08 IST|Sakshi

కార్పొరేటర్ల తీరుపై తుమ్మల ఆగ్రహం

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించం

సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ కార్పొరేటర్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహానికి గురయ్యారు. పట్టణంలో కార్పొరేటర్లతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల పనితీరుపై తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లకు చెడ్డపేరు వస్తే ప్రభుత్వానికి చెడు పేరు వస్తుందన్నారు. ప్రజలకు మంచి పేరు తెచ్చేలా ప్రజా ప్రతినిధులు పని చేయాలన్నారు. 

ఖమ్మం కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృద్ది సీఎం కేసీఆర్ సహా అందరూ మెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల దయతో గెలిచిన తాము ప్రజల కోసం పని చేయాలన్నారు. పద్దతి మార్చుకోని కార్పొరేటర్లు సహించేది లేదని హెచ్చరించారు. ఒకటి రెండు సీట్లను వదులుకోవడానికైనా తాము సిద్ధమన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే సీటు వచ్చే ఎన్నికలలో భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఎక్కడా గ్రూపులు ఉండవని అందరూ కేసీఆర్ మనుషులేనని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు