రైతులను ఆదుకుంటాం : మంత్రి తుమ్మల

8 May, 2015 15:28 IST|Sakshi
రైతులను ఆదుకుంటాం : మంత్రి తుమ్మల

పెనుబల్లి (ఖమ్మం): ఖమ్మం జిల్లా  పెనుబల్లి, తల్లాడ మండలాలలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్లతో కూడిన భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం పెనుబల్లి, తల్లాడ మండలాలలో అకాల వర్షానికి కూలిపోయిన ఇండ్లను, నేల రాలిన మామిడికాయ తోటలను, వడగండ్ల వానకు పంట కోల్పోయిన మొక్కజొన్న తోటలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల.. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతీ రైతు పొలాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖాధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించి, ప్రభుత్వానికి నష్టపోయిన రైతుల వివరాలతో సమగ్రంగా నివేదిక అందించాలని ఆదేశించారు. నివేదిక అందగానే ప్రభుత్వం నుంచి కొత్త జీవో ప్రకారం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా సాయం చేస్తామన్నారు. ఇళ్లు  కోల్పోయిన వారిని గుర్తించి సమాచారాన్ని అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు