దొరల రాజ్యం అంతం చేయాలి

28 Jul, 2018 13:15 IST|Sakshi
గొందిమల్లలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

అలంపూర్‌ (మహబూబ్‌నగర్‌): రాష్ట్రంలో దొరల రాజ్యాన్ని అంతమొందించాలని ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని లింగనవాయి, బైరన్‌పల్లి, గొందిమల్ల, కోనేరు, బుక్కాపురం, క్యాతూర్, భీమావరం గ్రామాల్లో శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ గ్రామాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెండు పడకల ఇళ్లు, దళితులకు మూడెకరాల పొలం ఎంత మందికి అందాయని ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారన్నారు. రాబోయేది ఇందరమ్మ రాజ్యమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు మహేశ్వర్‌ రెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సదానందమూర్తి, శ్రీధర్‌ రెడ్డి, రాము, నాయుడు, జనార్దన్‌రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు