‘వాళ్ల బాగోతాలు బయటపెడతా’

12 Jul, 2018 16:54 IST|Sakshi
ఆర్టీసీ ఛైర్మన్‌, అధికార పార్టీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

సాక్షి, పెద్దపల్లి : తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, వాళ్ల బాగోతాలు బయటపెడతానని ఆర్టీసీ ఛైర్మన్‌, అధికార పార్టీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం గోదావరిఖనిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన నాలుగేళ్లలో ఆశించిన అభివృద్ధి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో తప్పనిసరిగా రామగుండం ప్రాంతంలో పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. పని చేయని ప్రజాప్రతినిధులపై అవిశ్వాసం పెట్టే హక్కు ప్రజలకు ఉందని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.  

మరిన్ని వార్తలు