రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు

3 Dec, 2019 03:34 IST|Sakshi

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి 

సాక్షి, హైదరాబాద్‌: శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు దగ్గర్లో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రానున్న మూడురోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి.

నిజామాబాద్‌లో 8 డిగ్రీలు అధికంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 7.6 డిగ్రీలు ఎక్కువగా 23 డిగ్రీలు, భద్రాచలంలో 7.5 డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.1 డిగ్రీలు తక్కువగా 19 డిగ్రీలుగా రికార్డయింది. అక్కడ పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.1 డిగ్రీలు తక్కువగా 28.4 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 3 డిగ్రీలు తక్కువగా 27.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

>
మరిన్ని వార్తలు