సంగీత దీక్ష: ఎంపీ మల్లారెడ్డి కీలక ప్రకటన

24 Nov, 2017 16:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత శ్రీనివాస్‌రెడ్డి, ఆయన రెండో భార్య సంగీత మధ్య గొడవ చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కలిసి.. చర్చలు జరిపారు. సంగీత డిమాండ్లకు శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారని ఆయన తెలిపారు. సంగీతతో మాట్లాడి.. ఆమె దీక్షను విరమింపచేస్తానని ఆయన తెలిపారు. దీంతో ఈ వివాదానికి తెరపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. 

శ్రీనివాస్‌రెడ్డి మూడో పెళ్లి చేసుకోవడంతో.. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ అతని ఇంటి ముందు గత ఆరు రోజులుగా రెండో భార్య సంగీత నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగారు. చర్లపల్లి జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని వారు కలిసి రాజీ కుదుర్చడానికి ప్రయత్నించారు. సంగీతకు ఎంతో కొంత డబ్బు చెల్లించి వదిలించుకోవాలని శ్రీనివాస్‌రెడ్డికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ నేతల రాకతో జైలు ప్రాంతం సందడిగా మారింది.

కాగా ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజీ కుదిర్చేందుకు వ‌చ్చిన సామాజికవేత్తల, రాజ‌కీయ నాయ‌కుల‌ ప్రయత్నాలను కొంతమంది మహిళా కార్యకర్తలు ముందుకు సాగనివ్వడంలేదు. సంగీత కోరుతున్న ష‌రతుల‌కు మామ బాల్‌రెడ్డిని ఒప్పించి దీక్ష విర‌వింపజేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు