మూసీ గేట్లు ఎత్తివేత

18 Sep, 2017 16:30 IST|Sakshi
నల్లగొండ: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండలం మూసి ప్రాజెక్టు నిండుకుండలామారింది. ప్రాజెక్టు నీటిమట్టం 645 అడుగులకు(గరిష్ట స్థాయికి) చేరడంతో పాటు ప్రాజెక్ట్‌లోకి ఇంకా ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.
 
నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ రోజు ప్రాజెక్ట్‌ రెండు గేట్లను 2 అడుగుల మేర  ఎత్తి 1300 టీఎంసీల నీటిని కిందకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లను మరో ఫీట్‌ ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్‌ ఏఈ తెలిపారు. 
మరిన్ని వార్తలు