రూ.375 కోట్లతో నూతన పోలీస్‌ భవనాలు

4 Aug, 2017 00:37 IST|Sakshi
రూ.375 కోట్లతో నూతన పోలీస్‌ భవనాలు

116 చోట్ల కొత్త పోలీస్‌స్టేషన్లు, క్వార్టర్లు
పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్, ఎండీ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌తో పాటు ఎక్సైజ్, జైళ్ల శాఖకు సంబంధించిన భవన నిర్మాణాలను నిబద్ధతతో చేపడుతున్నా మని పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ తెలిపారు. నూతన జిల్లాల ఎస్పీ, కమిషనరేట్ల భవనాలు, పోలీస్‌ స్టేషన్ల ఆధునీ కరణ తదితర నిర్మాణాలను హౌజింగ్‌ కార్పొరేషన్‌ ప్రతిష్టాత్మకంగా చేపడుతోం దని ఆయన చెప్పారు. రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాల యంలోని హౌజింగ్‌ కార్పొరేషన్‌లో ఆయన మీడియా తో మాట్లాడారు.

 రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పోలీస్‌ శాఖలోని నిర్మాణాలతో పాటు జైళ్ల శాఖ, ఎక్సైజ్‌ శాఖకు సంబంధించి రూ.1100 కోట్ల విలు వైన నిర్మాణాలను తమ హౌజింగ్‌ బోర్డు నిర్మిస్తోం దన్నారు.  తనకు ఈ పదవి ఇచ్చి తోడ్పాటు అందిం చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞ తలు తెలుపుతున్నాన న్నారు. పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను ఎండీ మల్లారెడ్డితో కలసి మీడియాకు వెల్లడించారు.

వివరాలు...
రాష్ట్రంలో 116 చోట్ల పోలీస్‌ స్టేషన్‌ భవనా లు, క్వార్టర్లను నిర్మించడానికి ప్రభుత్వం రూ.93.07 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. 13 జిల్లా పోలీస్‌ కార్యాలయాలు, రెండు కమిషనరేట్ల నిర్మాణా నికి రూ. 375 కోట్లు మంజూరు చేయగా, ఈ పనులు టెండర్లు పిలిచే దశలో ఉన్నాయి.

వివిధ జిల్లాల్లో ఐఆర్‌ బెటాలియన్స్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేయగా, అందులో మూడు పనులు రూ. 10 కోట్ల ఖర్చుతో పురోగతిలో ఉన్నాయి. ఠి గ్రేహౌండ్స్‌ దళాలకు సంబంధించిన పనులకు గాను రూ. 68 కోట్లు మంజూరు చేయగా, వీటిలో తొమ్మిది పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పది పనులు పురోగతిలో ఉన్నాయి.

ఇక జైళ్ల శాఖకు సంబంధించిన 31 పనులకుగాను రూ. 4.44 కోట్లు మంజూరు చేయగా, 31 పనులు పురోగతిలో ఉన్నాయి.

అగ్నిమాపక శాఖకు సంబంధించిన 137 పనులను రూ.23.15 కోట్లతో చేపడుతున్నారు.

ఆబ్కారీ శాఖకి సంబంధించిన 9 స్టేషన్‌ బిల్డింగ్‌ పనులలో 8 పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. వీటి మొత్తం ఖర్చు రూ. 358.25 కోట్లు.

♦  రూ.100 కోట్లతో కరీంనగర్‌ నూతన కమిషనరేట్‌ భవనంతోపాటు బ్యారక్‌లు, క్వార్టర్లు, పరేడ్‌ గ్రౌండ్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌క్వార్టర్, బెల్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌ తదితర నిర్మాణాలను చేపడుతున్నారు.

ఇవి కాక కార్పొరేషన్‌ దగ్గరున్న రూ.30 కోట్లతో ఫ్రంట్‌ ఆఫీసుల నిర్మాణం, రూ.46.98 కోట్లతో పోలీస్‌ శిక్షణా సంస్థల స్థాయి పెంపు, రూ. 20 కోట్ల వ్యయంతో తెలంగాణ పోలీస్‌ అకాడమీ పనులు, రూ.30 కోట్లతో వరంగల్‌ కమిషనరేట్‌ పనులు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు