చర్చల తర్వాతే కొత్త రెవెన్యూ చట్టం అమలు

3 Nov, 2019 04:27 IST|Sakshi

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిల పక్ష నేతల డిమాండ్‌

పంజగుట్ట: సమగ్ర చర్చల అనంతరమే కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలని పలు రాజకీయ పక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ప్రభుత్వం చేపట్టిన భూముల రికార్డుల సవరణ దాని పరిణామాలు’అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, కోదండరెడ్డిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో వాస్తవ సాగుదారుల నుంచి భూమిని లాక్కుని భూస్వాములకు అప్పగించే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఇందులో భాగంగానే కాలమ్‌ నంబర్‌ 16 తొలగించారన్నారు. భూప్రక్షాళన భవిష్యత్తులో రక్తపాతాన్ని సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు పూర్తయినా భూరికార్డులను పరిశీలించే సీసీఎల్‌ఎను నియమించలేదన్నారు.

చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రెవెన్యూ భూవివాదాలను ఓ కమిటీ పరిష్కరించేదని, సదరు కమిటీ ఎన్నో కీలక అంశాలను బయటకు తీసుకొచి్చందని వాటిని అమలు చేసే లోపే తెలంగాణ ఉద్యమం వచి్చందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి  రెవెన్యూ వ్యవస్థనే తొలగిస్తానని అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు.రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ చట్టం తీసుకురావడం అవసరమే అయితే దీనికోసం విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్‌ రెడ్డి, సంపత్‌కుమార్‌లు మాట్లాడుతూ .. రాష్ట్రంలో ఇప్పటికీ 8లక్షల 90వేల మందికి పాసు పుస్తకాలు అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, రైతు సంఘం నాయకుడు నర్సింహ్మ రెడ్డి, నల్సార్‌ యూనివర్సిటీ ఫ్యాకల్టీ సభ్యుడు సునీల్, కాంగ్రెస్‌ నాయకురాలు ఇందిరా, వివిధ సంఘాల, పారీ్టల నాయకులు చైతన్య పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు