మోదీ పాలనలో భద్రత కరువు

14 Feb, 2018 15:14 IST|Sakshi

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

సైదాపూర్‌(హుస్నాబాద్‌): నరేంద్ర మోదీ పాలనలో భారతదేశానికి భద్రత కరువైందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. మండలంలోని బొమ్మకల్‌ గ్రామంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మోదీ నీచ రాజకీయాలు కాంగ్రెస్‌పై మోపడం సరికాదన్నారు. నాటి ముఖ్యమంత్రులు అంజయ్య, సంజీవరెడ్డిని కాంగ్రెస్‌ అవమానపరిచిందని విషం కక్కిన మోదీ.. ప్రస్తుతం చేసేది ఏమిటో చెప్పాలన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, దళితుడైన బంగారు లక్ష్మణ్‌పై కేసులు పెట్టించి జైలుకు పంపింది ఎవరని ప్రశ్నించారు.

మోదీ పాలనలో పాకిస్తాన్‌ జెండాలు జమ్మూకాశ్మీర్‌లో ఎగురుతున్నాయన్నారు. వారి వెంట మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పల్లేని రవీందర్‌రావు, గుండారపు శ్రీనివాస్, ఊసకోయిల రాఘవులు, సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు లంకదాసరి అరుణమల్లయ్య, అనగోని శ్రీనివాస్, మాజీ వైస్‌ ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, మిట్టపల్లి కిష్టయ్య, ఏలూరి ఆదిరెడ్డి, యువజన కాంగ్రెస్‌ అసెంబ్లీ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కార్యదర్శి మునిగంటి సంతోష్, పిట్టల రాకేశ్, సందీప్, రాహుల్‌ ఉన్నారు.

శైవక్షేత్రాల్లో పూజలు
బొమ్మకల్, గుజ్జులపల్లి, వెన్నంపల్లి, ఎగ్లాస్‌పూర్, ఆకునూర్‌ గ్రామాల్లోని శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొన్నం ప్రభాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి మొక్కులు చెల్లించారు. వారికి ఆలయ చైర్మన్, బ్రాహ్మణోత్తములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాలువాతో సన్మానం చేశారు.

మరిన్ని వార్తలు