'కాకతీయ’తో వలసలు వెనక్కు!

24 Jan, 2017 02:52 IST|Sakshi

మంత్రి హరీశ్‌కు అధికారుల వివరణ
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులన్నీ కళకళలాడుతుండటంతో గ్రామాల నుంచి వలస వెళ్లిన రైతు కూలీలు, వివిధ వృత్తుల వారు తిరిగి గ్రామాలకు వస్తున్నారని నీటి పారుదల శాఖ అధికారులు మంత్రి హరీశ్‌ రావుకు వివరించారు.  సోమవారం మిషన్‌ కాకతీయ 1, 2, 3వ విడత పనుల పురో గతిని సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హరీశ్‌ సమీక్షించారు. ఈ సంద ర్భంగా జిల్లాల అధికారుల నుంచి పనుల తీరుపై ప్రజా స్పందనను అడిగి తెలుసు కున్నారు. కొన్ని చెరువుల్లో వేసిన చేప పిల్లలు ఇప్పటికే 500 గ్రాములకు పైగా పెరిగాయని పేర్కొన్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన హరీశ్‌.. నీరు అత్యంత విలువైన సహజ సంపదగా రైతుల్లో అవగాహన తీసుకు రావాలని సూచించారు.  

మూడో విడత పనులపై అసంతృప్తి..
మిషన్‌ కాకతీయ మూడో విడతలో చేపట్టే పనుల కోసం ఇప్పటివరకు 20 శాతం కూడా ప్రతిపాదనలు పంపకపోవడంపై హరీశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 లోపు ప్రతిపాదనలు పంపించిన జిల్లాల ఇరిగేషన్‌ అధికారులకు చార్జ్‌ మెమోలు ఇవ్వాలని ఆదేశించారు.  పనిచేసిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులలో జాప్యాన్ని సహించబోనన్నారు.  బిల్లుల చెల్లింపులపై ఫిర్యాదులు వస్తున్నా యని.. ఇంజనీర్లు తమ ధోరణి మార్చుకోవా లని  హెచ్చరించారు. పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని, ఆ పనులను ఇతర కాంట్రాక్టర్లతో పూర్తి చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు