గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

17 Jan, 2015 17:58 IST|Sakshi

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం శివారులో ఏడుగుల గంగాధర్(32) అనే వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. జాకోరా గ్రామానికి చెందిన గంగాధర్‌కు భార్య లక్ష్మి , ఇద్దరు పిల్లలున్నారు. ఇంటిపెద్ద చనిపోవడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.

మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు