'ఓయూ జోలికొస్తే సీఎం కుర్చీ పెకిలిస్తాం'

20 May, 2015 22:46 IST|Sakshi

మెదక్(సిద్దిపేట): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) భూములను ముట్టుకుంటే ముఖ్యమంత్రి కుర్చీని పెకిలిస్తామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం సిద్దిపేటలో మాట్లాడుతూ..చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కల్పించి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా వెళ్లకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల భూములపై కన్నేసిందని ఆరోపించారు.

రాష్ట్రాన్ని గంపగుత్తగా కార్పొరేట్‌దారులకు విక్రయించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దానిలో భాగంగానే రామోజీ ఫిల్మ్‌సిటీని లక్ష నాగళ్లతో దున్ని పేదలకు పంపిణీ చేస్తానన్న కేసీఆర్.. రహస్య ఒప్పందాలు చేసుకొని బడా ప్రైవేటు కార్పొరేట్ల కంపెనీలకు ఏజెంటుగా మారాడని మండిపడ్డారు. కాళోజీ చెప్పినట్లుగా.. ప్రాంతం వారే మోసం చేస్తే ఆ ప్రాంతంలోనే పాతరేస్తామని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు