‘కానిస్టేబుల్‌ అని పిల్లనివ్వడం లేదు’

5 Nov, 2019 08:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎదుగుదల లేని ఉద్యోగమంటూ రాజీనామా

సోమవారం సీపీ ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌ : కానిస్టేబుల్‌ ఉద్యోగంతో జీవితం మారట్లేదనే ఆవేదనతో ఓ కానిస్టేబుల్‌ చేసిన రాజీనామాను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం ఆమోదించారు. చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిద్ధాంతి ప్రతాప్‌ సెప్టెంబర్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ పోలీస్‌ కమిషనర్‌కు రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పూర్వాపరాలు పరిశీలించిన కమిషనర్‌.. రాజీనామా ఆమోదిస్తూ ఉత్తర్వులు (డీవో నెం.9583/2019) జారీ చేశారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన ప్రతాప్‌ 2014లో కానిస్టేబుల్‌గా చేరాడు.
(చదవండి : కనీసం.. పిల్లనివ్వడం లేదు)

కొన్నాళ్లుగా తన సీనియర్లను పరిశీలించగా.. పలువురు 35 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా కానిస్టేబుల్‌గానే పదవీ విరమణ చేస్తున్న విషయాన్ని గుర్తించాడు. ఇంత సర్వీసు ఉన్న వారికి ఇతర విభాగాల్లో స్పెషల్‌ గ్రేడ్‌ ఇంక్రిమెంట్‌ లభిస్తోందని, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆపై స్థాయి అధికారులకు పదోన్నతులతో పాటు వాహనం, పెట్రోల్‌ వంటి ఇతర సౌకర్యాలు ఉన్నా.. కానిస్టేబుళ్లకు అలాంటివేవీ లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్‌ అని తెలియడంతో పెళ్లి సంబంధాలు కుదరట్లేదని వాపోయారు. తన రాజీనామాపై పునరాలోచన చేస్తానంటూ ఓ దశలో ప్రతాప్‌ పేర్కొన్నా.. చివరకు రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

న్యాల్‌కల్‌ రోడ్డులో భారీ చోరీ

దేవరకొండలో ఉద్రిక్తత

అధికారుల గైర్హాజరుపై జేసీ ఆగ్రహం

‘నా భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’

సీఎం బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి

కేన్సర్‌ రోగులకు ఎక్కడికక్కడ చికిత్స

ఇక చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ‘ఎకో’ చుక్‌ చుక్‌

సిగ్నల్‌ ఫ్రీ.. రవాణాకు రూట్‌ క్లియర్‌

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

కొత్త మున్సిపల్‌ చట్టాన్ని సరిచూసుకోండి

డిమాండ్లపై మల్లగుల్లాలు!

మూడు రోజులు విధుల బహిష్కరణ 

రెవెన్యూలో భయం.. భయం! 

మొక్కలతో స్వచ్ఛమైన వాతావరణం

దేశం తెలంగాణవైపు చూస్తోంది

తహశీల్దార్‌ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? 

వీఆర్వో గల్లా పట్టిన మహిళ

రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన సలహామండలి

బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు

పదవీకాలం ముగిసినా.. 

మహిళా తహసీల్దార్‌ సజీవ దహనం

క్లైమాక్స్‌కువిద్యుత్‌ విభజన

మ్యాన్‌హోల్‌లోకి మరమనిషి..!

గడువు దాటితే వేటే!

‘నిందితునిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు’

తహశీల్దార్‌ హత్యపై కేసీఆర్ విచారం

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ అల్టిమెట్టం

సురేశ్‌.. ఎమ్మారో ఆఫీసుకు ఎందుకెళ్లాడు?

ఎమ్మార్వో మృతికి ఉద్యోగ సంఘాలే కారణం: ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా