విపక్షాలు రైతుల పక్షాన ఉన్నాయి

22 Oct, 2014 03:22 IST|Sakshi
విపక్షాలు రైతుల పక్షాన ఉన్నాయి

* ప్రభుత్వం రాజకీయం చేస్తోంది..
* కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ
* బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా,
* కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

హన్మకొండ : అనేక సమస్యలు చుట్టుముట్టడంతో ఇబ్బంది పడుతున్న పడుతున్న రైతులకు విపక్షాలు అండగా నిలుస్తుండగా.. రాష్ర్టప్రభుత్వం మాత్రం రైతు సమస్యల పరిష్కారం పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాజకీయం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. రైతు సమస్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండ లో ధర్నా నిర్వహించారు. హన్మకొండ ఏకశిలా పార్కులో జరిగిన ధర్నాకు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రభుత్వం విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకపోవడమే కా కుండా రైతుల పక్షాన నిలబడిన వారిపై ఎదురుదిగడం గర్హనీయమన్నారు. తెలంగాణ వస్తే కష్టాలు తీరుతాయని భావించిన అన్ని వర్గాల ప్రజలు అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలి పారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవ డం, ప్రణాళికలు లోపించడంతోనే విద్యుత్ సమస్య ఏర్పడిందని.. దీంతో వెలుగుల పండు గ దీపావళిని చీకట్లో చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అంతేకాకుం డా విద్యుత్ కోతలతో రాష్ట్రంలో 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం గర్హనీయమన్నారు. ప్రభుత్వం మేల్కొని వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేసి వారికి అం డగా నిలవాలని దత్తాత్రేయ సూచించారు.
 
బారికేడ్లు, రోప్‌పార్టీతో..
ఏకశిలా పార్కులో ధర్నా అనంతరం బీజేపీ నా యకులు కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. ముందుగానే సమాచారం అందుకు న్న సుబేదారి పోలీసులు ఏకశిల పార్కు వద్దకు రోప్‌పార్టీతో చేరుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ బంగ్లా, కలెక్టరేట్ వద్ద బారికేడ్లతో అడ్డుకోగా.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తోసుకువెళ్లేం దుకు యత్నించారు. ఈక్రమంలో దత్తాత్రేయ సహా పలువురు నాయకులను పోలీసులు సుబేదారి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి కొద్దిసేపటికి వదిలేశారు.

కార్యక్రమాల్లో మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వరావు, నగర అధ్యక్షు డు చింతాకుల సునీల్‌తో పాటు వన్నాల శ్రీరాములు, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, రావు పద్మ, అమరేందర్‌రెడ్డి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్, నాగపురి రాజమౌళి, గట్టయ్య, దొంతి దేవేందర్‌రెడ్డి, మురళీమనోహర్, జి. సత్యనారాయణ, రాంబాబు, తిరుపతిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, దిలీప్, బిక్షపతి, రఘునారె డ్డి, రాంచంద్రారెడ్డి, జయపాల్, బుచ్చిరెడ్డి, నరసింహారావు, ప్రభాకర్, రంజిత్, సాంబ య్య, దేవేందర్‌రెడ్డి, శేషగిరిరావు, లక్ష్మణ్, రమణారెడ్డి, రఘునారెడ్డి పాల్గొన్నారు.
 
వరంగల్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
వరంగల్ నగర భివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉం దని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. హన్మకొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ హెరిటేజ్ సిటీగా ఇప్పటికే ఎంపిక చేసిన కేంద్రం, త్వరలో ఎంపిక చేయనున్న వంద స్మార్‌‌టసిటీల్లో స్థానం కల్పించనుం దని తెలిపారు. వార్డుల విభజన సాకుతో కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా వేయడం న్నారు. సీఎం కేసీఆర్ వెంటనే వరంగల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యుత్ కోతలు, మార్కెట్లలో సీసీఐ కొనుగోళ్లు, పంటల బీమాపై ప్రభుత్వం స్పందించాలని దత్తాత్రేయ సూచించారు.

మరిన్ని వార్తలు