24 న హైదరాబాద్‌కు రాష్ట్రపతి

22 Dec, 2017 11:11 IST|Sakshi

27 వరకు బొల్లారంలో శీతాకాల విడిది

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 24 నుంచి 27 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్‌లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. 24 వ తేదీ రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చే విందులో రామ్‌నాథ్‌ పాల్గొంటారు. ఆ తర్వాత 26 న రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందు నిర్వహిస్తారు. నగరంలో నాలుగు రోజుల పర్యటన అనంతరం 27వ తేదీ ఆయన అమరావతికి బయల్దేరుతారు. కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులు శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సమావేశమవుతారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా