మద్దతు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు: జేసీ

3 Apr, 2018 15:32 IST|Sakshi
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జేసీ చంద్రయ్య

వీపనగండ్ల: జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. సోమవారం సంగినేనిపల్లిలో డీఆర్‌డీఏ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొదటి గ్రేడ్‌ ధాన్యానికి రూ.1590, రెండవ గ్రేడ్‌కు రూ.1550 మద్దతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్నీ బ్యాగులు, ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌ చేసేందుకు ట్యాబ్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కొన్న ధాన్యాన్ని  గోదాంలకు తరలిస్తామని తెలిపారు. డీఆర్‌డీఓ గణేష్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, బీపీఎం భాషనాయక్, జిల్లా మార్కెటింగ్‌ మేనేజర్‌ లక్ష్మయ్య, సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా, సర్పంచ్‌ వీరయ్య, ఏపీఎం వెంకటేష్, విండో చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి, చిన్నారెడ్డి పాల్గొన్నారు.  
 

>
మరిన్ని వార్తలు