ప్రజా పోరాటాలకు..కాంగ్రెస్‌ కార్యాచరణ

2 Nov, 2019 03:09 IST|Sakshi

ఉత్తమ్‌ చైర్మన్‌గా 26 మందితో కమిటీని నియమించిన కుంతియా 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ దీనిపై ప్రజా పోరాటాలు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఏఐసీసీ కోర్‌కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ అవినీతిపై పూర్తి సమాచారం, ఆధారాలు సేకరించాలనే నిశ్చయానికి వచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శించి ఆధారాల సేకరణకు వీలుగా ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చైర్మన్‌గా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కన్వీనర్‌గా 26 మందితో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా కమిటీని ఏర్పాటు చేశారు.

దీనిలో పార్టీ సీనియర్‌ నేతలు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, టి.జీవన్‌రెడ్డి, కె.జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, విజయశాంతి, చిన్నారెడ్డి, మధుయాష్కీ, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మల్లురవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, అమీర్‌ జావేద్‌లను సభ్యులుగా నియమించారు.  అవినీతిపై మెమోరాండం రూపంలో రాష్ట్రపతి, గవర్నర్, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమర్పిస్తుంది.

మరిన్ని వార్తలు