వీఆర్వోలపై ఆర్డీఓ ఆగ్రహం 

13 Jun, 2018 08:52 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న ఆర్డీఓ వేణుమాధవ్‌  

కొడంగల్‌ రూరల్‌: మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పరిపాలనాధికారులపై తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు.

వీఆర్వోల పనితీరుపై ఆర్డీఓ అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన వీఆర్వోలు తహసీల్దార్‌ కార్యాలయానికే పరిమితమయ్యారని అన్నారు. రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన పాసుపుస్తకాల్లో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దాల్సిన బాధ్యతను వీఆర్వోలు విస్మరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు జవాబుదారీతనం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశ్, డీటీ ధనుంజయ, ఆర్‌ఐ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు