ఇంగ్లిష్‌లో ‘శతక సానెట్స్‌’

19 Jun, 2020 09:55 IST|Sakshi

పూర్తి చేసిన రేణుకుంట్ల మురళి

చేర్యాల(సిద్దిపేట): వివిధ సంస్థలు గత మే నెల 2వ తేదీ నుంచి నేటి వరకు నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ ఇంగ్లిష్‌ పద్యాల పోటీల్లో మండల పరిధిలోని గుర్జకుంట ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రేణుకుంట్ల మురళి శతక సానెట్స్‌ పూర్తి చేసి 50కి పైగా అవార్డులు సాధించాడు. గురువారం మురళి విలేకరులతో మాట్లాడుతూ.. పీబీ పబ్లిషర్స్‌ కమ్యూనిటీ, అన్‌టచ్డ్‌ ఎమోషన్స్, వ్రైటర్స్‌ యునైట్, నాజ్‌మేహయత్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఇంగ్లిష్‌ పద్యాల పోటీల్లో పాల్గొని కన్‌స్టాలేషన్, మదర్‌ గాడ్డెస్, స్మైల్‌ చైల్డ్‌హుడ్‌ మెమొరీస్, గస్టీ విండ్స్, విల్టెడ్‌ రేయిన్‌బో మొదలైన అంశాలపై 100కు పైగా పద్యాలు రాసినట్లు చెప్పారు.

అందుకుగాను 50కి పైగా అవార్డులను ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుచుకున్నట్లు తెలిపారు. తాను రాసిన పద్యాలలో కొన్నింటిని ఇన్సెంటివ్, ఇన్పినిటీ, బియాండ్, ఎంబర్, అరోరా, డియర్‌డాడ్, ఫోర్‌జెన్‌ ఫోలెన్, ఇంక్‌ పాబ్లెస్‌ లాంటి 20 ఆంథోళజీ పుస్తకాల్లో ముద్రించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్పోకెన్‌ ఇంగ్లిష్, గ్రామర్‌ పుస్తకం రచించానని, ప్రచురణ జరుగుతుందన్నాడు. తాను రచించిన పుస్తకాలు అమేజాన్, అమేజాన్‌ కిండ్లే, నేషన్‌ ప్రెస్, పిబి పబ్లిషర్స్‌ వంటి ప్రముఖ పుస్తక విక్రయశాలల్లో లభిస్తాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన మురళిని కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు అభినందించారు. 

మరిన్ని వార్తలు