ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!

25 Oct, 2023 10:34 IST|Sakshi

‘ఇక నీకు పూర్తిగా వచ్చేసినట్లే’ అని ఆంగ్లం ఎప్పుడూ అభయం ఇవ్వదు. ఆంగ్లభాషను ఎప్పటికప్పుడూ శోధిస్తూ పట్టు సాధిస్తూనే ఉండాలి... ఈ విషయంలో స్పష్టతతో ఉన్న యువతరం ఆంగ్ల మహాసముద్రంలో కలుస్తున్న నదులు, వాగులు, వంకల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. నిత్యావసర భాష అయిన ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సిట్‌కామ్స్‌ నుంచి చాట్‌జీపీటి టూల్స్‌ వరకు ఎన్నో దారులలో ప్రయాణిస్తోంది...

సిట్‌కామ్‌ (సిచ్యువేషనల్‌ కామెడీ షో)తో కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు అనేది పాత మాట. నవ్వుకోవడమే కాదు పదసంపద, నేటివ్‌ స్పీచ్‌పై పట్టు సంపాదించడానికి, పదాలతో ముడిపడి ఉన్న భావోద్వేగాల గురించి లోతుగా తెలుసుకోవడానికి సిట్‌కామ్‌లలోని విజువల్‌ ఎలిమెంట్స్‌ ఉపయోగపడతాయి అనేది నేటి మాట. అలాంటి సిట్‌కామ్స్‌లో కొన్ని...

చీర్స్‌ (1982–1993)
థీమ్‌ సాంగ్‌ ‘ఎవ్రీబడీ నోస్‌ యువర్‌ నేమ్‌’ నుంచి చివరి డైలాగ్‌ వరకు ఏదో ఒక కొత్తపదం పరిచయం అవుతూనే ఉంటుంది. రకరకాల సెట్‌లలో కాకుండా ఒకటే లొకేషన్‌లో చిత్రీకరించడం వల్ల ఒకేచోట పూర్తిగా దృష్టి కేంద్రీకరించవచ్చు. ‘చీర్స్‌’లోని హాస్యాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఫ్రైజర్‌ (1993–2004)
చీర్స్‌లోని ఎపిసోడ్‌లను అర్థం చేసుకున్నవారికి ఫ్రైజర్‌ కష్టమేమీ కాదు. ఈ సిట్‌కామ్‌లోని ప్రధాన పాత్రలైన ఫ్రైజర్, నీల్‌ మార్టిన్‌ల క్లీన్‌ యాక్సెంట్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ‘ప్రైజర్‌’ నిండా ఇంటెలిజెంట్‌ హ్యూమర్‌ వినిపించి కనిపిస్తుంది.

ది సింప్సన్స్‌ (1980)
ది సింప్సన్‌ టీవీ సిరీస్‌ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ యానిమేటెడ్‌ సిట్‌కామ్‌లో క్యారెక్టర్‌ల మధ్య నడిచే సంభాషణలు ఫ్యామిలీ టాపిక్స్‌పై ఉంటాయి. రియల్‌–లైఫ్‌ ఫ్రేజ్‌లపై అవగాహనకు ఉపయోగపడుతుంది. పుస్తకాల కంటే సహజమైన భాషను నేర్చుకోవచ్చు.

ది వండర్‌ ఇయర్స్‌ (1988–93)
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కెవిన్‌ అర్నాల్డ్‌ అనే టీనేజర్‌ ప్రధాన పాత్రలో కనిపించే సిట్‌కామ్‌ ఇది. యువత మానసిక ప్రపంచానికి అద్దం పడుతుంది. కెవిన్‌ అతని ఫ్రెండ్స్‌ ఎదుర్కొనే రకరకాల సమస్యలతో యూత్‌ ఆటోమేటిక్‌గా రిలేట్‌ అవుతారు. యంగ్‌ పీపుల్‌ ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్‌ చేసే పద్ధతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ది ఫ్రెష్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ బెల్‌–ఎయిర్‌ (1990–1996)
ఈ హిట్‌ కామెడీ షోలో ఎక్కువమందిని ఆకట్టుకునే క్యారెక్టర్‌ విల్‌ స్మిత్‌. ఫన్నీ డైలాగులు, జోక్స్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సోషల్‌ క్లాస్‌ స్పీకింగ్‌ ఇంగ్లిష్‌ నుంచి స్ట్రీట్‌ ఇంగ్లీష్‌ వరకు అవగాహన ఏర్పర్చుకోవచ్చు.

ఫ్యామిలీ మ్యాటర్స్‌ (1989–1998)
ఈ సిట్‌కామ్‌లో కనిపించే రకరకాల ఎక్స్‌ప్రెషన్‌లు, గెశ్చర్‌ లెర్నర్న్‌కు ఉపయోగపడతాయి. స్పష్టమైన, సంక్షిప్తమైన యాక్సెంట్‌ వినిపిస్తుంది. కుటుంబ జీవితానికి సంబంధించి ఇళ్లల్లో వినిపించే ఇంగ్లిష్‌ ఇడియమ్స్‌ గురించి తెలుసుకోవచ్చు.

ది నానీ (1993–1999)
రకరకాల యాక్సెంట్‌లను ఈ సిట్‌కామ్‌లో వినవచ్చు. సామాన్య ప్రజలతో పోల్చితే ధనవంతులు ఎలా మాట్లాడతారో చూడవచ్చు... ఇవి మచ్చుకు కొన్ని సిట్‌కమ్స్‌ మాత్రమే. ఎన్నో కోణాలలో భాషను మెరుగు పరుచుకునే సిట్‌కామ్‌లు ఎన్నో ఉన్నాయి. అప్‌–టు–డేట్‌ ఇంగ్లిష్‌ లెసన్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ‘సెన్సేషన్‌ ఇంగ్లిష్‌’పై కూడా యూత్‌ ఆసక్తి చూపుతుంది. ఇంటర్నేషనల్‌ న్యూస్‌ వీడియోలు, ఆర్టికల్స్‌ ద్వారా 5 లెవెల్స్‌లో భాషను మెరుగు పరుచుకోవచ్చు.

ప్రాక్టీస్‌ యువర్‌ ఇంగ్లిష్‌ టుడే’ అంటోంది లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ యాప్‌ ప్రోమోవ. మూడువేల పదాలతో కూడిన 40 థీమ్‌డ్‌ టాపిక్స్, ఇడియమ్స్, స్లాంగ్‌ వర్డ్స్, ఎవ్రీ డే ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రోమోవలో ఉన్నాయి. లైవ్‌ లెసన్స్, కాన్వర్‌జేషన్‌ ఈవెంట్స్, ఏఐ ్ర΄ాక్టీస్‌ టాస్క్స్, సోషల్‌ లెర్నింగ్‌ గేమ్స్, లెర్నింగ్‌ జర్నీ తమ ప్రత్యేకతగా చెబుతుంది విజువల్‌ వరల్డ్స్‌ ఇమార్స్‌.

లాంగ్వేజ్‌ లెర్నింగ్‌లో కీలక పరిణామం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ). స్థానిక, స్థానికేతరులను భాష నైపుణ్యం మెరుగుపరుచుకోడానికి, పర్సనలైజ్‌డ్‌ లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌కు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఉదా: లెర్నర్స్‌ బలాలు, బలహీనతల ఆధారంగా పర్సనలైజ్‌డ్‌ కరికులమ్‌ను, లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ గేమ్స్‌ను రూపొందిస్తుంది. తప్పులను ఎత్తి చూపుతుంది.

ఇంగ్లిష్‌ లిరిక్స్‌ వినడం ద్వారా కూడా భాషలో నైపుణ్యాన్ని పెపొందించుకునే ధోరణి పెరుగుతోంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు రకరకాల యాక్సెంట్‌లను అర్థం చేసుకోవచ్చు. పదసంపద పెంచుకోవచ్చు. బెటర్‌ ప్రోనన్సియేషన్‌కు ఉపయోగపడుతుంది. అలనాటి ప్రసిద్ధ ఇంగ్లిష్‌ పాటల్లో ఎన్నో ప్రయోగాలు కనిపిస్తాయి. ఎల్విన్‌ ప్రెస్లీ, మైకెల్‌ జాక్సన్‌ నుంచి నిన్న మొన్నటి కుర్రకారు సంగీతకారుల వరకు ఎంతోమంది పాత పదాలను కొత్తగా ప్రయోగించారు.

‘ఇంగ్లిష్‌ భాషలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపకరించే మాటలు’ అంటూ ప్రతి సంవత్సరం కొన్ని పాటలను సిఫారసు చేస్తున్నారు ఆంగ్ల భాషా నిపుణులు. ‘ఇక నాకు అంతా వచ్చేసినట్లే’ అనే మాట ఆంగ్లం విషయంలో ఎప్పటికీ వినిపించదు. ఎందుకంటే... ఆంగ్ల భాష అనగానే వినిపించే ప్రసిద్ధ మాట... వర్క్‌ ఇన్‌ప్రోగ్రెస్‌. అందుకే ఆంగ్లంలో ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి యువతరం వివిధ మార్గాలలో ప్రయాణిస్తుంది.

(చదవండి: కూతురుకి మంచి ర్యాంకు రావాలని ఆ తండ్రి చేసిన పని తెలిస్తే షాకవ్వడం ఖాయం!)


  

మరిన్ని వార్తలు