పేలిన సిలిండర్లు.. నలుగురు సజీవ దహనం

5 Jun, 2015 23:54 IST|Sakshi

శామీర్ పేట: శామీర్ పేట రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిలిండర్ లోడ్తో వెళుతున్న లారీని మరో లారీ ఢీకొని భారీగా మంటలు వ్యాపించాయి. అందులోని సిలిండర్లు వరుసగా పేలిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అందులోని డ్రైవర్తో సహా నలుగురు సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం వల్ల శామీర్ పేట నుంచి హకీం పేట వరకు పూర్తిగా స్తంభించి వాహనాలు నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు