బ్లాక్ మార్కెట్‌కు అంగన్‌వాడీ కోడిగుడ్లు

26 Dec, 2015 02:36 IST|Sakshi
బ్లాక్ మార్కెట్‌కు అంగన్‌వాడీ కోడిగుడ్లు

 - రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్తులు
 - ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణ
 - కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్న పగిడా్‌‌యల్ వాసులు
 గండేడ్ :
అంగన్‌వాడీల్లో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పంపిణీ చేయాల్సిన కోడిగుడ్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా.. గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని పగడ్యాల్ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి..గ్రామంలోని రెండో అంగన్‌వాడీ కార్యకర్త బాలమణి అంగన్‌వాడీ సెంటర్ నుంచి మూడు రోజులుగా రాత్రి వేళలో కోడిగుడ్లను ఓ ప్రైవేటు వాహనంలో తరలిస్తున్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
 
 అందులో సుమారు 300 కోడిగుడ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని గ్రామపంచాయతీ వద్దకు తరలించి అధికారులకు సమాచారం అందించారు.  విషయం తెలుసుకున్న అధికారులు బుధ, గురువారాల్లో కూడా వచ్చి కూడా పరిశీలించారు. అయితే బాధ్యులపై ఎటువంటి చర్యా తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ అర్హులకు అందాల్సిన పౌష్టికాహారం బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈవిషయాన్ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు విలేకరులకు వివరించారు.
 

మరిన్ని వార్తలు