ఓయూలో శేఖర్‌ కమ్ముల సందడి

4 Aug, 2018 11:47 IST|Sakshi
ప్రొఫెసర్లు, విద్యార్థులతో శేఖర్‌ కమ్ముల

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సినీ దర్శకులు శేఖర్‌ కమ్ముల సందడి చేశారు. ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గత మూడు వారాలుగా నిర్వహిస్తున్న ఇండక్షన్‌ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్‌ కమ్ముల విద్యార్థులతో అనేక విషయాలు పంచుకున్నారు. సమయం వృథా చేసుకోకుండా, చదవుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల  ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ సమీరఫాతిమా, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కృష్ణయ్య, పీజీఈసెట్‌ కో–కన్వీనర్‌ ప్రొ.రమేష్‌బాబు, ప్లేస్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొ.ఉమామహేశ్వర్, కోఆర్డినేటర్‌ ప్రొ.శివరామకృష్ణ, డాక్టర్‌ మేడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు