సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

26 Jun, 2014 03:31 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జూలై 1 నుంచి ఆగస్టు 1 వరకూ అదనపు బోగీలు, బెర్తులు, సీట్లు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో  కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
 
 ఔరంగాబాద్-తిరుపతి (07405) ప్రత్యేక రైలు జూలై 4, 11 తేదీలలో మధ్యాహ్నం 3 గంటలకు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి మరునాడు మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-ఔరంగాబాద్ (07406) ప్రత్యేక రైలు జూలై 5, 12 తేదీలలో సాయంత్రం 5.10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది.  
 
 విజయవాడ-సికింద్రాబాద్ (07207) ప్రత్యేక రైలు జూలై 3, 10 తేదీలలో రాత్రి 11 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. తిరిగి సికింద్రాబాద్-విజయవాడ (07208)ప్రత్యేక రైలు జూలై 4, 11 తేదీలలో రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది.
 
 సికింద్రాబాద్-విశాఖపట్నం (02728) ఏసీ సూపర్‌ఫాస్ట్ ట్రైన్ జూలై 4, 11 తేదీలలో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖపట్టణం-సికింద్రాబాద్ (02727) ప్రత్యేక రైలు జూలై 5, 12 తేదీలలో రాత్రి 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది.  
 
 సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (02723) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ట్రైన్ జూలై 6న ఉదయం 11.55కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి మధ్యాహ్నం 1.25కి నిజాముద్దీన్ చేరుతుంది. తిరిగి హజ్రత్ నిజాముద్దీన్-సికింద్రాబాద్ (02724) రైలు జూలై 7న రాత్రి 7.20కి నిజాముద్దీన్ నుంచి బయలుదేరుతుంది.
 
 అదనపు బోగీలు ఏర్పాటు చేసే రైళ్లు ఇవే..

 సికింద్రాబాద్-నిజాముద్దీన్ దురంతో బై వీక్లీ, సికింద్రాబాద్-విశాఖ దురంతో, దర్భంగా-సికింద్రాబాద్ బై వీక్లీ, సికింద్రాబాద్-సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి సెవెన్‌హిల్స్, తిరుపతి-కరీంనగర్ బై వీక్లీ, సికింద్రాబాద్-పాట్నా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-బికనూర్ బై వీక్లీ, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, విజయవాడ-చెన్నై పినాకిని, విజయవాడ-విశాఖ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, కాకినాడ-భావ్‌నగర్ వీక్లీ, కాకినాడ-షిరిడీ ట్రైవీక్లీ, విజయవాడ-హుబ్లీ అమరావతి ఎక్స్‌ప్రెస్, విజయవాడ-సాయినగర్ షిరిడి ఎక్స్‌ప్రెస్, నాందేడ్-ముంబయి తపోవన్, ధర్మాబాద్-మన్మాడ్ మరఠ్వాడా ఎక్స్‌ప్రెస్.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు