డ్రోన్‌తో పురుగుమందు పిచికారీ 

22 Feb, 2019 03:16 IST|Sakshi

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీలో ప్రదర్శన

హైదరాబాద్‌ : డ్రోన్‌ ద్వారా పురుగుమందు పిచికారీ చేసే విధానాన్ని గురువారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శించారు. సెన్స్‌కర్‌ సంస్థ సహకారంతో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రయోగాత్మకంగా ఈ డెమో ఏర్పాటు చేశారు. పది లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును డ్రోన్‌కు అమర్చి రిమోట్‌ సహాయంతో జీపీఎస్, జీఐఎస్‌ పరిజ్ఞానం వినియోగించి స్ప్రే ఎలా చేయాలి? ఎంత మోతాదులో పురుగుమందు వాడాలి? తదితర అంశాలను పరిశీలించారు. ఈ ప్రదర్శనను వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఆర్‌ జగదీశ్వర్, వరి పరిశోధనా కేంద్రం హెడ్‌ డాక్టర్‌ ప్రదీప్, వరి విభాగం శాస్త్రవేత్తలు, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ విభాగంలోని శాస్త్రవేత్తలు, యూజీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు, అధ్యాపకులు పరిశీలించారు.

మరిన్ని వార్తలు