పట్టాలపై దారుణం

19 Oct, 2014 02:32 IST|Sakshi
పట్టాలపై దారుణం

తల్లి, ఇద్దరు కూతుళ్లను బలిగొన్న కలహాల కాపురం

మహబూబాబాద్/ఖమ్మం అర్బన్ : భర్త వేధింపులు ఆ ఇల్లాలిని కుంగదీశారుు. పన్నెండేళ్ల సంసారంలో సంతోషంగా ఉన్నది తక్కువే. భర్త రోజూ తాగొచ్చి వేధించినా.. ఆమె భరించింది. ఊరునిండా అప్పులుచేసినా కూలో నాలో చేసి తీర్చింది. అరుునా అతడిలో మార్పు రాకపోగా.. రెండు రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తుం డడంతో విసిగివేసారింది. పాఠశాల నుంచి తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని పుట్టెడు దుఃఖంతో రైలు పట్టాలపైకి చేరుకుంది. పిల్లలతో సహా రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడి కానరాని లోకాలకు చేరింది. మహబూబా బాద్ లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో రైలు పట్టాలు రక్తసిక్తమయ్యూరుు. మృతుల స్వగ్రామమైన ఖమ్మం జిల్లా చొప్పకట్లపాలెం, ప్రస్తుతం నివాసముంటున్న టేకులపల్లిలో విషా దాన్ని నింపింది.

పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట జగ్గవరం కాలనీకి చెందిన తూము నాగమణి, గంగాధరం దంపతుల కుమార్తె శ్రావణి(28)కి అదే జిల్లా బోనకల్ మం డలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన బొగ్గవరపు ఆంజనేయులుతో 12 ఏళ్ల క్రితం వి వాహమైంది. వారికి కుమార్తెలు అమూల్య(11), జీవణి(9) ఉన్నారు. మద్యానికి బానిసైన ఆంజనేయులు భార్యపై అనుమానంతో నిత్యం వేధించేవాడు. దీంతో మూడేళ్లుగా ఆమె తన పిల్లలతో కలిసి భర ్తకు దూరంగా ఉంటోంది. మూడు నెలల క్రితమే పెద్దమనుషులు ఎదుట తాను మారానని, తాగు డు మానానని ఒప్పుకుని భార్య, పిల్లలను తీసుకెళ్లాడు. ప్రస్తుతం వారు ఖమ్మం శివారు టేకులపల్లిలో శ్రీలక్ష్మినగర్ రోడ్డు నంబర్ 4లో నివాసముంటున్నారు. శ్రావణి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. ఆంజనేయులు ఖమ్మం శివారులోని క్వారీలో కూలీగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 11న తాగొచ్చి ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. రోజూ అలాగే కొడుతుండడంతో ఓపిక నశించిన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయల్దేరింది. ఖమ్మం రోటరీనగర్‌లో ఉంటున్న తన అక్క దగ్గరికి వెళుతున్నట్లు ఇంటి పక్కవారికి చెప్పి తన కుమార్తెలు చదువుతున్న కస్తూర్భా స్కూల్‌కు చేరుకుంది. వారితో పని ఉందని వెం టబెట్టుకుని బయల్దేరింది. అల్లుడు రోజూ కొడు తున్నాడని తెలియడంతో కూతురిని చూసేందుకు నాగమణి శుక్రవారం సాయంత్రం శ్రావణి ఉండే ఇంటికి వెళ్లగా ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె తన కుమా రుల తో కలిసి వెళ్లి రాత్రి రాత్రి 9 గంటలకు ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వారు సమీపంలోని సాగర్‌కాల్వ, పరిసర ప్రాంతాల్లో గాలించినా జాడ తెలియలేదు. ఆమె వాడుతున్న సెల్ సిగ్నల్స్ ఆధానంగా పోలీసులు ఆరా తీయగా నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అచూకీ లభించలే దు.

ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాక మహబూబాబాద్ వద్ద రైలు కిందపడి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన వార్త టీవీల్లో  శనివారం ఉదయం రావడం చూసి ఖమ్మం అర్బ న్ ఎస్సై రుద్రగాని వెంకటనారాయణ వెంటనే మహబూబాబాద్  పోలీసులకు సమాచారమి చ్చారు. అదృశ్యమైన తల్లీ కూతుళ్ల ఫొటోలు పంపారు. వాటిని పరిశీలించిన మానుకోట పోలీసులు మృతులు వారేనని నిర్ధారించారు. దీం తో సమాచారం అందుకున్న మృతుల బంధువు లు మహబూబాబాద్‌కు చేరుకున్నారు. విగతజీవు లుగా పడి ఉన్న కూతురు, మన వరాళ్లను చూ డగానే నాగమణి రోదించిన తీరుచూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యూరు. ఈ కేసును ఖమ్మం అర్బన్‌కు బదిలీ చేశాక  విచారణ చేసి చర్య తీసుకుంటామని ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు