అడుగంటుతున్న శ్రీరాంసాగర్

5 Mar, 2015 03:31 IST|Sakshi
అడుగంటుతున్న శ్రీరాంసాగర్

బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రాకపోవడం.. బాబ్లీ ప్రాజెక్టు కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా, వేసవి ప్రారంభం కాకముందే.. బుధవారం ఆనాటికి కేవలం 14.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. లీకేజీల రూపంలో 200 క్యూసెక్కులు, ఆవిరితో 250 క్యూసెక్కుల నీరు నిత్యం తగ్గిపోతుందని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇక వేసవి ప్రారంభమైతే.. ప్రాజెక్టులో నీరు భారీగా ఇంకిపోయే ప్రమాదముంది. ఈ క్రమంలో వేసవిలో తాగునీటికి సైతం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా లభించని పరిస్థితి నెలకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకూ కూడా సాగునీటిని విడుదల చేయాలేదు.
 

మరిన్ని వార్తలు