స్టార్‌ క్యాంపెయినర్ల ఖర్చు పార్టీ, అభ్యర్థి ఖాతాలోనే

9 Jan, 2020 01:49 IST|Sakshi

గుర్తింపు పొందిన, రిజిస్టర్‌ పార్టీలకు 20 మంది స్టార్‌ క్యాంపెయినర్లు

గుర్తింపు లేని పార్టీలకు 5 మందికి ఎస్‌ఈసీ అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు తమ వద్ద రిజిస్టర్‌ చేసుకున్న రాజకీయ పార్టీల నుంచి 20 మంది నాయకులకు, గుర్తిం పు లేని పార్టీలకు చెందిన ఐదుగురు నాయకులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా కల్పన లేదా అనుమతి కల్పించింది. స్టార్‌ క్యాంపెయినర్లుగా గుర్తించిన వారు సంబంధిత పార్టీ/దాని తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి తరఫున రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి బుధవారం ఆదేశాలు జారీచేశారు.  

ఈ అనుమతి కోసం రాజకీయ పారీ్టలు బయోడేటా, ఐడెంటిటీ కార్డు (ఓటరు గుర్తింపునకు ఎస్‌ఈసీ నోటీఫై చేసిన కార్డుల్లో ఏదో ఒ కటి) ప్రతితో స్టార్‌ క్యాంపెయినర్ల జా బితాలను ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన 3 రోజుల్లోగా రాష్ట్ర అధికారిగా వ్యవహరిస్తున్న మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌కు సమరి్పంచాలి. దీని ప్రతిని ఎస్‌ఈసీకి మార్కుచేయాలి. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలను సమాచారం నిమిత్తం జిల్లా ఎన్నికల అధికారులు, అదనపు/సహాయ జిల్లా అధికారులకు మున్సిపల్‌ డైరెక్టర్‌ పంపిస్తారు. స్టార్‌ క్యాంపెయినర్లకు వాహనాల అనుమతి ఇచ్చే అధికారాన్ని కూడా మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌కు ఎస్‌ఈసీ కలి్పంచింది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌లో ని ఫార్మాట్‌ ప్రకారం స్టిక్కర్‌తో కూడిన అనుమతిపత్రాన్ని ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.  

ఫొటో వాడినా అభ్యర్థి ఖాతాలోనే..
స్టార్‌ క్యాంపెయినర్లకు అయ్యే ఖర్చును సంబంధిత పార్టీ లేదా అభ్యర్థి వ్యయానికయ్యే ఖాతాలో చూపాల్సి ఉంటుంది. ఈ ప్రచారకర్తల రవాణా ఖర్చులను సంబంధిత పారీ్టనే భరించాల్సి ఉంటుంది. స్టార్‌ క్యాంపెయినర్‌ లేదా ఇతర నేతల ర్యాలీ లేదా సభా వేదికపై సదరు అభ్యర్థి లేదా అతడి ఏజెంట్‌ పాల్గొంటే ర్యాలీకయ్యే మొత్తం ఖర్చును (స్టార్‌ క్యాంపెయినర్‌ రవాణా చార్జీలు మినహాయించి) అభ్యర్థి ఎన్నికల వ్యయంలో కలుపుతారు. ఒకవేళ అభ్యర్థి పాల్గొనకపోయినా అతడి పోస్టర్లు, ఫొటోలుంటే కూడా ఈ వ్యయాన్ని ఆయన ఖాతాలోనే వేస్తారు. ఈ ర్యాలీలు, సభల్లో ఒకరికంటే ఎక్కువమంది అభ్యర్థులు పాల్గొంటే ఖర్చును ఆ మేరకు విభజించి వారి ఎన్నికల వ్యయంలో కలుపుతారు.   

మరిన్ని వార్తలు