రేవంత్ కోసం సుప్రీం లాయర్లు

10 Jun, 2015 11:19 IST|Sakshi
రేవంత్ కోసం సుప్రీం లాయర్లు

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది రేవంత్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. రేవత్ రెడ్డి బెయిల్ పిటిలషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. కుమార్తె నిశ్చితార్థానికి రెండు రోజులు బెయిల్ కావాలని రేవంత్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. మేం కూడా నాగరిక ప్రపంచంలో ఉన్నామని, ఈ సాయంత్రం వెళ్లి..రేపు సాయంత్రం వస్తే మాకు అభ్యంతరం లేదని పబ్లికి ప్రాసిక్యూటర్ అన్నారు. ఒకరోజుకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఎవరితోనూ భేటీకాకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవించారు. రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేక కస్టడీ కొనసాగుతుందా అనే విషయం మరికాసేపట్లో తెలియనుంది.

మరిన్ని వార్తలు