సిజ్జూకు ఆపరేషన్‌

27 Jul, 2019 11:41 IST|Sakshi

గచ్చిబౌలి: ఓ పెంపుడు కుక్క గర్భ సంచికి కణితి ఏర్పడటంతో నాలుగు నెలలుగా ఆ మూగ జీవి నరకం చూసింది. దానికి ఆపరేషన్‌ చేయించి బతికించుకున్నాడు దాని యజమాని. వివరాల్లోకి వెళితే.. పుణేకు చెందిన ఆర్మీ అధికారి అమిత్‌ రాయ్‌ ‘సిజ్జు’ పేరుగల ఓ కుక్కను పెంచుతున్నారు. ఇటీవల ఆయన బదిలీపై బోయిన్‌పల్లికి వచ్చారు. సిజ్జు కడుపు ఉబ్బిపోయి ఆహారం తీసులేక ఇబ్బంది పడుతోంది. ఇలా నాలుగు నెలలుగా బాధపడుతోంది. దాంతో యజమాని అమిత్‌రాయ్‌నగరంలోని అనేక యానిమల్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. అయినా రోగం నయం కాలేదు. మూడు రోజుల క్రితం గచ్చిబౌలిలోని మిస్టర్‌ వెట్‌ యానిమల్‌ ఆస్పత్రికి వెళ్లారు. తన సిజ్జూను బికించమని డాక్టర్‌ను అమిత్‌ వేడుకున్నారు. దాంతో శునకానికి ఎక్స్‌రే తీసిన డాక్టర్‌ ఎన్‌. రమేష్‌.. శునకం గర్భసంచిలో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. ఆపరేషన్‌ చేస్తేనే కుక్క బతుకుతుందని చెప్పడంతో అందుకు అమిత్‌ సమ్మతించారు. యజమాని సూచన మేరకు రెండు గంటల పాటు ఆపరేషన్‌ చేసి ఆరు కిలోల బరువున్న శునకం కడుపులో నుంచి రెండున్నర కిలోల కణితిని తొలగించారు. ఆపరేషన్‌ విజవంతం కావడంతో కుక్కను యజమానికి అప్పగించారు. తన పెంపుడు శునకం ప్రాణాలు దక్కినందుకు అమిత్‌ రాయ్‌ ఎంతో సంతోషిస్తున్నారు.

మరిన్ని వార్తలు