అనుచిత వ్యాఖ్యలు సహించం: తమ్మినేని

10 Apr, 2017 02:24 IST|Sakshi
అనుచిత వ్యాఖ్యలు సహించం: తమ్మినేని

ఇబ్రహీంపట్నం: రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా సహిం చేదిలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణ కమిటీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ అధ్యక్షతన ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన దళిత బహుజనుల ఆత్మగౌరవ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అగ్రకుల దుర హంకారంతో మాట్లాడే వారిపై చేసే పోరాటానికి సీపీఎం మద్దతు ఉంటుందన్నారు.

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రిజర్వేషన్లను కించపరిచేలా మాట్లాడడంపై మండిపడ్డారు. దళితులకు 17.5, ఎస్టీలకు 10% చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయని.. కానీ, బీసీలకు లేకపోవడం విచారకరమన్నారు.  కులవివక్ష లేని దేశంగా మారినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సంపదను సమానంగా పంచితే అణగారిన కులాల పిల్లలు ఉన్నత చదువులు చదివి చూపిస్తారన్నారు. ఇక్కడ నుంచి ప్రారంభమై న రాజ్యాంగ, రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమం దేశవ్యాప్తంగా రూపాంతరం చెందాలని.. దీని కి సీపీఎం మద్దతు ఉంటుందన్నారు. సామాజిక న్యాయం కోసం ఇక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభించానని.. దీనిని అడ్డుకోవాలని పాలకులు యత్నించినా ప్రజల మద్దతు ఉండటంతో సాధ్యపడలేదన్నారు.

మరిన్ని వార్తలు