ఎస్సీ వర్గీకరణలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి: కిషన్ రెడ్డి

13 Nov, 2023 15:44 IST|Sakshi

హైదరాబాద్‌: దశాబ్దాల నాటి సమస్యలపై ప్రధాని మోదీ దృష్టి సారించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ చిత్తశుద్దితో పనిచేయలేదని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే మొదటి ముద్దాయి అని ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమస్యను ప్రధాని మోదీ అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఆరోపించారు. 

ఎస్సీ వర్గీకరణను చేపడతామని హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..

మరిన్ని వార్తలు