మొదటి రోజే స్పందించి ఉంటే...

6 Apr, 2015 11:39 IST|Sakshi
మొదటి రోజే స్పందించి ఉంటే...

హైదరాబాద్ :  సూర్యాపేట బస్టాండ్ వద్ద కాల్పుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మొదటి రోజే స్పందించి ఉంటే ఇంతవరకూ వచ్చేది కాదని టీడీపీ సీనియర్ నేత ఎల్.రమణ అన్నారు. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు లేవని అన్నారు. హోంమంత్రి కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవటం లేదని ఎల్.రమణ ఆరోపించారు.  

ఎదురుకాల్పుల్లో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు రూ. కోటి  పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగంతో పాటు, మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలన్నారు. హోదాతో సంబంధం లేకుండా మృతి చెందిన పోలీసు కుటుంబాలకు కోటి రూపాయిలు ఇవ్వాలని సూచించారు.

 కాగా కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, ఎస్ఐలను టీడీపీ నేతలు పరామర్శించారు.  ఎస్ఐ సిద్ధయ్యకు అవసరం అయితే విదేశాల నుంచి వైద్యులను రప్పించి వైద్యం అందించాలని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకరరావు కోరారు.

మరిన్ని వార్తలు