నేడు టెన్త్‌ ఫలితాలు

13 May, 2019 01:23 IST|Sakshi

ఉదయం 11:30 గంటలకు విడుదల

విద్యార్థుల కోసం గ్రీవెన్స్‌ మొబైల్‌ యాప్‌

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గం.కు సచివాలయం డి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఈ ఫలితాలను  www. sakshieducation. com,  http:// results. bse. telangana. gov. in,  http:// results. cgg. gov. in,  www. bse. telangana. gov. in వెబ్‌సైట్‌లో  పొందవచ్చు. అలాగే పాఠశాలలు, విద్యార్థులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్‌ను  www. bse. telangana. gov. in వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

అలాగే మొబైల్‌ ప్లే స్టోర్‌ నుంచి టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు అని టైప్‌ చేసి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించింది. డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్‌ కావాల్సి ఉంటుంది. లాగిన్‌ అయ్యాక అందులో పేరు, పాఠశాల విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్‌ వస్తాయి. అలాగే విద్యార్థులు తమ మొబైల్‌ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాలి. మెయిల్‌ ఐడీని నమోదు చేసి సేవ్‌ చేయాలి. విద్యార్థులు ఫలితాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే గ్రీవెన్సెస్‌లోకి వెళ్లి దానిని సెలెక్ట్‌ చేసి, టెక్ట్స్‌ బాక్స్‌లో ఫిర్యాదు రాసి సబ్మిట్‌ చేయాలి. ఆ తరువాత కన్‌ఫర్మేషన్‌ మేసేజ్‌ విద్యార్థుల మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. అయితే ఇందులో ఒక్కసారే ఫిర్యాదు చేయడానికి వీలు ఉంటుంది. 

మరిన్ని వార్తలు