జీఎస్టీ రెవెన్యూలో తెలంగాణ అగ్రగామి

24 Dec, 2018 03:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే జీఎస్టీ రెవెన్యూలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహ్మద్‌ ముజాహిద్‌ హుస్సే న్‌ వెల్లడించారు. జీఎస్టీ రాబడి వృద్ధి రేట్లలో కూడా రాష్ట్రం ముందు వరసలో ఉండటం హర్షదాయకమన్నారు. ఈమేరకు ఆదివారం రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను కలసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వ్యాపారులకు జీఎస్టీపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవడంతోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. మొదటి నుంచి జీఎస్టీ వసూళ్లలో క్రమశిక్షణతో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్ర భాగంలో ఉందని  అన్నారు. ఇందుకు కమిషనర్‌ అనిల్‌కుమార్‌తోపాటు అధికారులు, ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు