త్వరలోనే పాసుపుస్తకాలు 

6 Oct, 2019 03:03 IST|Sakshi

దేవాలయం పేరు మీద ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: దేవాలయ భూములకు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ అధికారులు గుర్తించిన భూములకు ఆయా దేవాలయాల మీదే పాసుపుస్తకాలివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు సమీకృత భూరికార్డుల నిర్వహణ (ఐఎల్‌ఎంఆర్‌ఎస్‌) వెబ్‌సైట్‌లో ఆ భూములకు డిజిటల్‌ సంతకాలు చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించింది.

దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్లు మ్యాపింగ్‌ చేసిన సర్వే నంబర్లకు తహసీల్దార్ల లాగిన్‌ల ద్వారా డిజిటల్‌ సంతకాలు చేయాలని, ఈ సంతకాలు పూర్తయిన భూములకు పట్టాదారు పాసుపుస్తకం కమ్‌ టైటిల్‌డీడ్‌ ఇస్తామని సీసీఎల్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం క్షేత్రస్థాయి రెవెన్యూ వర్గాలకు సమాచారం పంపింది. దేవాదాయ భూములకు పాసు పుస్తకాలివ్వడంతో పాటు ప్రక్షాళనలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను కూడా పరిష్కరించే విధంగా అదనపు ఆప్షన్లు ఇచి్చంది. దీంతో పెండింగ్‌ సమస్యలకు పరిష్కా రం లభిస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.   

మరిన్ని వార్తలు