కాంగ్రెస్‌ నేతల అక్రమ అరెస్టుపై విచారణ చేపట్టిన హైకోర్టు

19 Jun, 2020 20:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజకీయ దురుద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టులో వాదించారు. కోవిడ్-19 నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని ఏజీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్ట్ పిటీషన్‌లపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడితో పాటు పలువురు ఎంపీలు పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 12 పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పిటీషనర్ల తరపు న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. (సంతోష్‌ బాబు కుటుంబానికి భారీ సాయం: కేసీఆర్‌ )

జూన్ 1 నుంచి జూన్ 13 వరకు కాంగ్రెస్ నేతలను అరెస్టులతో పాటు గృహ నిర్బంధం చేస్తున్నారని పిటీషన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులపై ప్రభుత్వం కక్ష పూర్వకంగా వ్యవహరిస్తోందని కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ఏలాంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు కూడా నాలుగు సార్లు అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్‌కు సంబంధించి ఎక్కడ రీకార్డ్ నమోదు చేయలేదని న్యాయవాది రచనా రెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుతం కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏమైనా ఆందోళనలకు పిలుపునిచ్చారా అని హైకోర్టు పిటీషనర్‌ను ప్రశ్నించారు. అలాగే మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేయిర్ గైడ్ లైన్స్ పాటిస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి బదులుగా ఆందోళనలకు ఎలాంటి పిలుపు ఇవ్వలేదని, గైడ్ లెన్స్ ప్రకారం నడుచుకున్నామని రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. (వాడిలో నిన్ను చూసుకుంటాం.. వచ్చేయ్)

పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీకి చేయడానికి వెళ్తున్న వారిని అడ్డుకున్నారా అని పిటీషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.  గిరిజనులకు సాయం చేసిన ములుగు ఎమ్మెల్యేను హైకోర్టు ప్రశంసించగా.. ములుగు ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేసారని రచనా రెడ్డి పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ తరపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ జల దీక్ష కు పిలుపునిచ్చారని కోర్టుకు తెలిపారు. జలదీక్ష వలన ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా  వారిని ప్రొటెస్ట్ చేశామని పేర్కొన్నారు. జలదీక్షకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలా అని అడ్వొకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో వచ్చే సోమవారంలోపు కౌంటర్ ధాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రోజుల్లో కాంగ్రెస్ నేతల కదలికలను అనుసరించొద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. (తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు)

>
మరిన్ని వార్తలు