డెంగీ మృతుల వివరాల్ని చెప్పొద్దంటారా?

21 Sep, 2019 02:20 IST|Sakshi

అధికారుల తీరును తప్పుపట్టిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: డెంగీ వల్ల అవయవాలు దెబ్బతిని రోగులకు ప్రాణాంతకమవుతోందని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న దృష్ట్యా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలనడం సరికాదని హైకోర్టు తేల్చిచెప్పింది. వైద్యం పొందుతూ మరణించిన డెంగీ రోగుల వివరాల్ని వెళ్లడించొద్దని ప్రైవేట్‌ ఆస్పత్రులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. అధికారుల తీరు సమర్థనీయం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. డెంగీ నివారణకు తీసుకున్న చర్యల్ని వివరించాలని ఆదేశిస్తూ విచారణను 25కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు