బాధ్యతలు స్వీకరించిన మంత్రులు

22 Feb, 2019 01:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోడ్లు, రవాణాశాఖ మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్‌ డీ–బ్లాక్‌లో తన చాంబర్‌లో సాయంత్రం 4 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి (టీఎంయూ), హన్మంత్‌ ముదిరాజ్, గోవర్ధన్‌ (టీజేఎంయూ), రాజిరెడ్డి, బాబు (ఈయూ) తదితరులు మంత్రిని సన్మానించారు. అధికార పార్టీ నాయకులు, అనుచరుల కోలాహలంతో ఆయన చాంబర్‌ సందడిగా మారింది. అనంతరం రోడ్లు–భవనాలు, ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయశాఖ నూతన మంత్రిగా నిరంజన్‌రెడ్డి గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమైఖ్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయిపోయిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. దూరదృష్టితో ప్రాజెక్టులను నిర్మించిన కేసీఆర్‌ రైతులను రాజులుగా చూడటమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై ఒక్క ప్రాజెక్ట్‌ కూడా నిర్మించలేదని, ఇప్పుడు కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతోందన్నారు. రైతుబంధు దేశంలోనే గొప్ప పథకమని, దీని వల్ల రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రాలీల్లేక తిప్పలు!

‘ఆమె’కు ఆమే భద్రత

రక్తనిధి ఖాళీ

మధుర ఫలం.. విషతుల్యం

నీరొక్కటే చాలదు సుమా..!

గొంతులో ఇరికిన ఎముక..

తెలంగాణ లోక్‌సభ ఓట్ల లెక్కింపు; లైవ్‌ అప్‌డేట్స్‌

రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు

ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రీపోలింగ్‌

‘పిల్ల కాల్వ’ల కళకళ! 

మైనంపల్లికి త్రుటిలోతప్పిన ప్రమాదం

మరికొద్ది గంటల్లో!

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఏ నిమిషానికి ఏమి జరుగునో?

ఆఖరి వరకు అప్రమత్తంగా ఉండాలి

ప్రయాణికులకు బోగిభాగ్యం

సోయా విత్తనోత్పత్తిలో కంపెనీల మోసం

తెలంగాణలో ఆర్థిక సంక్షోభం:రాకేశ్‌రెడ్డి

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

పార్టీ ఫిరాయింపుల వెనక తాయిలాలు

ఈడీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేం

ఎన్నికల నిలుపుదల సాధ్యం కాదు

కాబోయే పోలీసులకు కొత్త పాఠాలు

పరిషత్‌ ఫలితాలు వాయిదా వేయాలి

పశువులకూ ‘ఆధార్‌’!

సారూ.. ఇది డైనోసారూ...

పేకాటలో జోకర్‌లా చంద్రబాబు

టీఎస్‌ ఈసెట్‌ ఫలితాలు విడుదల 

ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్‌ కన్నుమూత 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంజలి చాలా నేర్పించింది!

అరేబియన్‌ రాజ్యంలో...

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను